బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు బయల్దేరారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరారు. జొహన్నెస్బర్గ్కు చేరుకోనున్న మోదీ.. అక్కడ జరిగే 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఆహ్వానం మేరకు ఆగస్టు రెండ్రోజుల పాటు ఆ దేశంలో మోదీ పర్యటించనున్నారు.
సాధారణంగా ప్రతి విదేశీ పర్యటనకు ముందు ఆ టూర్ కు సంబంధించి ట్వీట్ చేయడం మోదీకి అలవాటు. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాఫ్రికా టూర్ గురించి కూడా మోదీ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలో.. బ్రిక్స్ సదస్సుతో పాటు.. బ్రిక్స్-ఆఫ్రికా అవుట్రీచ్ కార్యక్రమంలో తాను పాల్గొంటానని తెలిపారు. గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తామని చెప్పారు. వైవిధ్యమైన రంగాల్లో సంబంధాల బలోపేతానికి బ్రిక్స్ కృషి చేస్తోందని.. ఈ సదస్సుకు హాజరయ్యే నేతల్లోని ‘కొంతమంది’తో తాను సమావేశమవుతానని మోదీ వెల్లడించారు.
“జొహన్నెస్బర్గ్లో నేను బ్రిక్స్ సదస్సుతో పాటు బ్రిక్స్ ఆఫ్రికా అవుట్రీచ్ కార్యక్రమంలో పాల్గొంటా. బ్రిక్స్ ప్లస్ చర్చల్లో భాగమవుతా. బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం పొందిన అతిథులతో సంభాషించేందుకు ఎదురుచూస్తున్నా. జొహన్నెస్బర్గ్కు వచ్చే దేశాధినేతల్లోని కొందరితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నా.” – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
Leaving for South Africa to take part in the BRICS Summit being held in Johannesburg. I will also take part in the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue events. The Summit will give the platform to discuss issues of concern for the Global South and other areas of…
— Narendra Modi (@narendramodi) August 22, 2023