శ్రావణ మాసంలో ఈ పూలతో అమ్మవారిని ఆరాధిస్తే.. సంపద పెరుగుతుంది..!

-

శ్రావణమాసం అంటే మొట్టమొదట మనకి గుర్తు వచ్చింది అమ్మవారి పూజ. అమ్మవారికి శ్రావణమాసంలో పూజ చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. ప్రతి ఇంటా కూడా శ్రావణమాసంలో అమ్మవారిని పెట్టి పూజిస్తూ ఉంటారు. అమ్మవారిని ఆరాధిస్తే ఎన్నో చక్కటి ఫలితాలు కనబడతాయి. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఈ పూలను పెట్టండి ఈ పూలను పెడితే కచ్చితంగా అమ్మవారు మీ కోరికల్ని తీరుస్తారు.

శ్రావ‌ణ మాసం

ఎర్రమందారాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారికి ఎర్ర మందార పూలని పెట్టండి ఎర్రమందారాలని శక్తి స్వరూపంగా అభివర్ణిస్తారు. కనుక కచ్చితంగా అమ్మవారిని పూజించేటప్పుడు మీరు ఎర్రమందారాలని వాడండి. బంతి పూలను కూడా మీరు అలంకరణగా వాడుకోవచ్చు. తోరణాలుగా కట్టి పెడితే చాలా అందంగా ఉంటుంది. సరస్వతీ దేవికి మోదుగ పూలు అంటే ఇష్టం మోదుగ పూలని దొరికితే పెట్టండి. అమ్మవారిని మోదుగ పూలతో పూజిస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది. పారిజాతం పూలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు.

విష్ణువుకి ఈ పూలు అంటే చాలా ఇష్టం. చాలా ఆలయాల్లో ఈ పూల చెట్లు ఉంటాయి. అమ్మవారికి తామర పూలు పెడితే కూడా చాలా ఇష్టం అమ్మవారిని పూజించేటప్పుడు తామర పూలను పెట్టండి. తామర పూలను అమ్మవారికి పెడితే మీకు శుభం కలుగుతుంది. అనుకున్నవి జరుగుతాయి. మల్లెపూలను కూడా అమ్మవారికి పెట్టండి. మల్లెపూలు కూడా అమ్మవారికి ఇష్టం. ఉమ్మెత్త పువ్వులని, ఎర్రగన్నేరు పూలని, తెల్లగన్నేరు పూలని కూడా అమ్మగారికి పెట్టొచ్చు. నందివర్ధనం పూలతో కూడా అమ్మవారిని పూజించొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version