కార్గిల్‌ 25వ విజయ్‌ దివస్‌ సందర్భంగా యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు

-

కార్గిల్‌ యుద్ధం.. భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీరోచితానికి ప్రతీక.  ఆ విజయగాథకు నేటితో సరిగ్గా పాతికేళ్లు. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నివాళులర్పించారు. కార్గిల్‌ 25వ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని కార్గిల్‌లోని ద్రాస్‌లో గల యుద్ధవీరుల స్మారకాన్ని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా  ప్రధాని మోదీ… యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. అనంతరం అమర జవాన్ల సతీమణులు, కుటుంబసభ్యులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. ఆనాటి స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు. వారి వీరోచిత పోరాటానికి మరోసారి సెల్యూట్ చేశారు.

మరోవైపు కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్‌ వేదికగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. మన సాయుధ దళాల ధైర్యం, పరాక్రమానికి పత్రీక ఈ విజయగాథ అని ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు. 1999 నాటి కార్గిల్‌ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి జవాన్‌కు నివాళులర్పించారు. వారి త్యాగం, శౌర్యం నుంచి దేశ ప్రజలంతా స్ఫూర్తి పొందుతారు జై హింద్‌. జై భారత్‌’’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news