గ్లోబల్‌ సౌత్‌ దేశాల కోసం అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం.. ప్రధాని మోదీ ప్రతిపాదన

-

గ్లోబల్‌ సౌత్‌ దేశాల అభివృద్ధి కోసం మానవీయ కోణంలో ‘అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం’ చేసుకోవాలని ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు.  టెక్నాలజీ పంపిణీ, వాణిజ్య సహకారం, తక్కువ వడ్డీకి రుణాలందించే దిశగా ఈ ఒప్పందం ఉండాలని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పారు. భారత్‌ నిర్వహించిన దక్షిణార్ధ గోళ దేశాల మూడో వర్చువల్‌ సదస్సులో ఆయన ప్రసంగించారు.

గ్లోబల్ సౌత్ దేశాలైన ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కరీబియన్, ఆసియా (ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా మినహా), ఓషియానియా (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మినహా)ల్లో చాలా దేశాలు చైనా రుణ వలలో పడుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో ప్రధాని ఈ పిలుపునిచ్చారు. అభివృద్ధి రుణాల పేరుతో అవసరార్థ దేశాలపై భారం మోపకూడదని ఆయన పేర్కొన్నారు.  అందుకే భారత్‌ తరఫున అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నానని తెలిపారు. 25 మిలియన్‌ డాలర్లతో ‘సామాజిక ప్రభావిత నిధి’ని ఏర్పాటు చేస్తామని వెల్లడించిన మోదీ.. ఇది డిజిటల్‌ రంగంలో మౌలిక వసతులకు ఉపయోగపడుతుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news