తిరుపతి : రేపు నవంబర్ టికెట్లు రిలీజ్..!

-

రేపు ఆన్ లైన్ లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు నవంబర్ నెలకు సంభందించివి విడుదల చెయ్యనుంది టీటీడీ. అలాగే రేపు లక్కి డిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కేట్లు కూడా విడుదల చెయ్యనున్నారు. దీని కోసం 21వ తేది వరకు భక్తులు రిజిష్ర్టేన్ చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ.

ఇక ప్రస్తుతం తిరుమల కొండాపై భక్తుల రద్ది పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయ్యి ఏటిజిహేచ్ వరకు క్యూ లైన్ లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 77807 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే తలనీలాలు సమర్పించిన భక్తులు సంఖ్య 38340 మందిగా ఉంది. ఇక నిన్న ఒక్క రోజే హుండి ఆదాయం 4.02 కోట్లుగా నమోదయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news