పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు.. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితా విడుదల

-

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వీటికి దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేశారు. తాజాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పదో తరగతి అర్హతపై ఎంపిక చేసే ఈ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 పోస్టులున్నాయి. తాజాగా విడుదల చేసిన తొలి జాబితాలో ఏపీ నుంచి 1355 మంది; తెలంగాణ నుంచి 981 మంది షార్ట్‌ లిస్ట్‌ అయినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను చెక్ చేసుకోవాలంటే ఈ లింక్ https://indiapostgdsonline.gov.in/https://indiapostgdsonline.gov.in/ క్లిక్ చేయండి.

మరోవైపు ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు.. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌, పదో తరగతి మార్కుల మెమో, 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు , ఆదాయ ధ్రువీకరణపత్రం, దివ్యాంగులకు దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, మెడికల్‌ సర్టిఫికెట్‌ వంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news