కరోనా దెబ్బ… భారత్‌లో రెడింతలైన పేదల సంఖ్య

-

కరోనా వైరస్ ప్రపంచమే ఊహించని ఓ అనూహ్య పరిణామం. కంటికి కనిపించని ఈ మహమ్మారి దెబ్బకు కోట్లాది మంది ప్రజల బతుకులు చిద్రమయిపోయాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. చేసుకోవడానికి పని లేక చాలా కుటుంబాలు ఇప్పటికి ఆర్థికంగా వెనుకబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ చాలా మంది ఆశల మీద నీళ్ళు చల్లేలా కనిపిస్తోంది.

కాగా గతేడాది కరోనా దెబ్బకు భారత్‌లో పేదల సంఖ్య రెట్టింపు అయింది. ఈ విషయం అమెరికాకు చెందిన ‘పియో పరిశోధనా కేంద్రం’ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది కరోనా ముందు భారత్‌లో నిరుపేదలు (రోజుకు రూ. 150 కంటే తక్కువ సంపాదించేవారు) 6 కోట్లుగా ఉండగా… ఈ ఏడాది ఆ సంఖ్య 13.4 కోట్లకు చేరిందని ‘పియో’ అధ్యయనం తెలిపింది. అలానే మధ్య తరగతి (రోజువారీ ఆదాయం రూ. 750-1500 మధ్య ఉన్న ) జనాభా గతేడాది కరోనా ముందు 9.9 కోట్లు ఉండగా… అది ఈ ఏడాది 6.6 కోట్లకు తగ్గింది.

కాగా లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమల్లో పనిచేసేవారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారని, అత్యధిక శాతం మంది ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఈ అధ్యయనం వెల్లడించింది. కరోనా రెండో దశ ప్రభావం కూడా భారత్ ఆర్థిక వ్యవస్థపై ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని జపాన్‌కు చెందిన నోముర రీసెర్చ్ సంస్థ (ఎన్ఆర్ఐ) శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రానున్న నెల రోజుల్లో వైరస్‌ను కట్టడి చేయకుంటే ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news