టికెట్ కొని రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ

-

నేడు ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని నాగపూర్, చత్తీస్గఢ్లోని బిలాస్పూర్ మధ్య నడిచే ఆరవ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను జండా ఊపి ప్రారంభించారు ప్రధాని. ఈ రైలు మహారాష్ట్రలోని నాగపూర్, చత్తీస్గడ్ లోని బిలాస్పూర్ మధ్య నడుస్తుంది. ఆయన వెంట కేంద్ర మంత్రి నితిన్ గట్కరి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, భగత్ సింగ్, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మెట్రో రైలు టికెట్ కొనుక్కొని, కొంతమంది పిల్లలతో కలిసి ప్రయాణించారు. రైలులో విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. అలాగే నేడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్, నాగ్ రివర్ పొల్యూషన్ అబెట్ మెంట్ ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news