ఒకసారి పెట్టుబడి పెట్టి నాటితే 16 ఏళ్ళు లాభాలను పొందే ఏకైక పంట పింక్ జామ..అందుకే ఈ పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఈపంట సాగును చేపట్టారు.అధిక అదాయం చేతికి వస్తుండమే రైతులు ఈ పంటసాగు చేపట్టటానికి కారణం. అయితే పంట ఉత్పత్తి బాగా ఉండాలంటే సరైన యాజమాన్య పద్దతు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెగుళ్ల విషయంలో సకాలంలో నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందవచ్చు..
పింక్ జామలో తెగుళ్లు , నివారణ చర్యలు..
పింక్ జామలో నులిపురుగులు, మిలీబగ్, పండు ఈగ ఈపంటకు అధిక నష్టాన్ని కలిగిస్తాయి. నులిపురుగులు వీటిని నెమటోడ్లు అని కూడా పిలుస్తారు. వేరు మధ్యలో తిష్టవేసుకుని మొక్కకు సరఫరా అయ్యే ఆహారాన్ని తీంటూ వృద్ధి చెందుతాయి. దీని వల్ల మొక్క క్రమంగా ఎండిపోయి చనిపోతుంది. ఈ తెగులు సోకిన చెట్టు వాడిపోయి ఎండిపోతాయి. మొదలు తవ్వి వేరును పరిశీలిస్తే వేర్ల మధ్య ఉబ్బినట్టుండి లోపల గూళ్లు కనబడతాయి. ఈ తెగులు నర్సరీలోనే సరైన జాగ్రత్తలు తీసుకోక పోవటం వల్ల సోకుతుంది. మొక్కలు కొనుగోలు చేసే సమయంలో వేర్లను పరిశీలించి తీసుకోవాలి.
థాయ్ పింక్ జామకు సోకే మరో తెగులు మిలీబగ్. దీనినే పిండినల్లి లేదా రసం పీల్చే పురుగు అంటారు. ఈ తెగులు సోకిన మొక్కలు పేను బంక ఆశించిన మందార చెట్టును పోలి ఉంటాయి. సకాలంలో చర్యలు తీసుకోకుంటే నష్టం జరుగుతుంది. పంటకు నష్టం కలిగించే వాటిలో పండు ఈగ కూడా ఒకటి. ఇది తోటను ఆశించిన తరువాత ఎంతటి విషపూరిత రసాయన మందులు పిచికారి చేసిన ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
వీటి నివారణ చర్యల విషయాన్నికొస్తే.. నెమటోడ్ల నివారణకు 20 కిలోల వేపపిండి నీటిలో వేసి 48 గంటలు నానబెట్టాలి. 200ల లీటర్ల నీటిలో ట్రైకోటెర్మా హరిజోనమ్, సుడోమోనాస్, మైసిస్, లీలాసినస్ లను రెండు కిలోల చొప్పున కలిపి 24 గంటల పాటు నిలువ ఉంచి కలియబెట్టి మొక్కల మొదళ్ల వద్ద పోసి నెమటోడ్లను పూర్తిగా నివారించవచ్చు.పిండి నల్లి నివారణకు లీటరుకు 2గ్రాముల డిటర్జెంట్ పౌడరును కలిపి తెగులు సోకిన చెట్టు పూర్తిగా తడిచేలా స్ప్రే చేసి పిండి నల్లిని అరికట్టవచ్చు. అలాగే పండు ఈగను పూత పిందె దశలో లింగాకర్షక బుట్టలు అమర్చి నివారించవచ్చు..సేంద్రీయ ఎరువులతో మొక్కలకు వేసుకుంటే తెగుల్లు ఆశించవు..మరింత సమాచారం కోసం వ్యవసాయ నిపునుల సలహా తీసుకోవడం మంచిది..