చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనం : ప్రధాని మోడీ

-

వినాయక చతుర్థి రోజు కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టడం సంతోషకరం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కొత్త సభలోకి ఎంపీలందరినీ ఆహ్వానిస్తున్నాం అని ప్రకటించారు ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడుతూ.. ఆధునికతకు అద్దం పట్టడంతో పాటు చరిత్రను ప్రతిభింబిచేలా కొత్త పార్లమెంట్ భవనం ఉందన్నారు. ఆజాదీ అకాలంలో ఇది ఉషోదయ కాలం అన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే మా లక్ష్యం. స్వాతంత్ర్య ఉద్యమంలో సెంగోల్ కీలక పాత్ర వహించారు. నెహ్రు చేతికి శోభనిచ్చిన సెంగోల్ నేడు సభలో కొలువు దీరింది. భవిష్యత్ తరాలకు స్పూర్తిని ఇచ్చేవిధంగా పని చేయాలన్నారు ప్రధాని మోడీ.

దేశం గర్వించేవిధంగా పార్లమెంట్ భవనం నిర్మించుకున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పని చేయాలని పేర్కొన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలన్నదే మా సంకల్పమని తెలిపారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మరోవైపు మరికాసేపట్లోనే మహిళా బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ పార్లమెంట్ లో మధ్యాహ్నం 3 గంటలకు మహిళా బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news