సరిహద్దులకు మోడీ… సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ…!

-

దీపావళి సందర్భంగా సరిహద్దు ప్రాంతాలను సందర్శించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంవత్సరం కూడా జవాన్లతో పండుగను జరుపుకునే అవకాశం ఉంది. భద్రతా దళాలతో దీపావళి పండుగను చేసుకోవడానికి ప్రధాని మోడీ కొన్ని సరిహద్దు పోస్టులను సందర్శించే అవకాశం ఉంది అని జాతీయ మీడియా పేర్కొంది. నవంబర్ 14 శనివారం దీపావళి పండుగ జరుపుంటున్న సంగతి తెలిసిందే.

దీపావళి సందర్భంగా జవాన్లతో ఆయన భేటీ కానున్నారు. మోడీ గతంలో పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. గతేడాది ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్‌ లోని రాజౌరి జిల్లాలో దీపావళిని జరుపుకునేందుకు వెళ్ళారు. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఆయన జరుపుకున్నారు. 2018 లో ఆయన ఉత్తరాఖండ్ సరిహద్దులలో జరుపుకున్నారు. 2017 లో ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌ను సందర్శించి అక్కడ జరుపుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news