యూపీ టీచర్ వీడియోపై ప్రియాంక గాంధీ ఫైర్

-

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఓ ప్రైవేట్ స్కూల్ లో ముస్లిం విద్యార్థిని చంప దెబ్బలు కొట్టే రీతిలో తోటి విద్యార్థులను ప్రోత్సహించిన టీచర్ కి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థిని కొట్టించడం సంగతి అటు ఉంచితే ఆమె మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో రాజకీయ వర్గాల్లో కూడా అగ్గిరాజుకుంది.

వీడియో ఆధారంగా ఆ టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసులు విద్యాశాఖను ఆదేశించారు. వైరల్ అవుతున్న ఈ వీడియో పై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. ఇది ఎలాంటి తరగతి గది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు మనం ఎలాంటి పాఠశాలలను, సమాజాన్ని ఇవ్వాలనుకుంటున్నాం అని ప్రశ్నించారు. చిన్నారుల మనసుల్లో ద్వేషాన్ని నింపడం ఏంటని నిలదీశారు. సదరు ఉపాధ్యాయురాలిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రియాంక గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news