ఎబి డివిలియర్స్ : విరాట్ కోహ్లీ ఆ స్థానంలో పర్ఫెక్ట్

-

ఇండియా మాజీ కెప్టెన్ మరియు కీ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించిన ఘనత విరాట్ కు దక్కుతుంది. ఇక మరో వారం రోజుల్లో శ్రీలంక వేదికగా జరగనున్న ఆసియా కప్ మరియు వరల్డ్ కప్ లు చాలా కీలకమైన టోర్నీలు అని చెప్పాలి. కాగా తాజాగా సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్ కోహ్లీ గురించి ఒక కామెంట్ చేశాడు. ఈయన తన యు ట్యూబ్ ఛానెల్ ఎబి డివిలియర్స్ 360 ద్వారా కోహ్లీ రానున్న వరల్డ్ కప్ లో ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్న విషయం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. డివిలియర్స్ కోహ్లీ నెంబర్ 4 లో బ్యాటింగ్ చేస్తే ఇండియాకు విజయాలను అందించగలడు అని నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

కానీ కోహ్లీకి నెంబర్ 3 లో ఆడడం అంటే చాలా ఇష్టం అయినప్పటికీ నెంబర్ 4 లోనే జట్టుకు ఉపయోగం ఉంటుందని చెప్పాడు. మరి ఈ కామెంట్ పై విరాట్ కోహ్లీ లేదా టీం యాజమాన్యం ఏమైనా స్పందిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news