ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆమ్ ఆద్మీ పార్టీలో సంస్థాగత మార్పులకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆప్ అధినేత కేజ్రీవాల్ నేతృత్వంలో పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురి సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మనిషి సిసోడియా, సౌరబ్ భరద్వాజ్ లాంటి నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మనిష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ లాంటి నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఢిల్లీ ఆప్ విభాగానికి సౌరబ్ భరధ్వాజ్, పంజాబ్ ఇన్ చార్జీగా మనిష్ సిసోడియాను నియమించారు. సౌరబ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే రెండు సంవత్సరాల ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా సౌరబ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. మొత్తం నాలుగు రాష్ట్రాలకు ఇన్ చార్జీలను నియమించినట్టు పార్టీ ప్రకటించింది.