పంజాబ్ సంచ‌ల‌న నిర్ణయం : టీకా తీసుకోకుంటే జీతం క‌ట్

-

దేశ వ్యాప్తం గా కరోనా వైర‌స్ వ్యాప్తి విప‌రీతం గా పెరుగుత‌న్న నేప‌థ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్లు తీసుకోకుంటే.. జీతం ఇవ్వ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. అందు కోసం వ్యాక్సిన్ తీసుకోకుంటే నో జాబ్.. నో సాల‌రీ అనే ప‌ద్ధ‌తిని తీసుకు వ‌చ్చామ‌ని తెలిపారు. ఉద్యోగులు తీసుకున్న ఫ‌స్ట్ డోస్ కానీ, సెకండ్ డోస్ కానీ తీసుకుంటే త‌మ వెబ్ సైట్ లో న‌మోదు చేయాల‌ని సూచించింది.

అలాగే క‌రోనా వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్ ను కూడా అప్ లోడ్ చేయాల‌ని ఆదేశించింది. అలాగే హ‌ర్యాన రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా క‌రోనా వైరస్ కేసుల నేప‌థ్యం లో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోని వాళ్ల‌ను బ‌హిరంగ ప్ర‌దేశాల‌కు అనుమ‌తి ఉండద‌ని ప్ర‌క‌టించింది. వారి నిషేధం ఉంటుంద‌ని తెలిపింది. ప్ర‌తి ఒక్కరూ రెండు డోసుల తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. కాగ దేశ వ్యాప్తం గా క‌రోనా వైర‌స్ తో పాటు ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యం లో రాష్ట్రాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news