చాలామందికి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు పొట్ట చుట్టూ వుండే కొవ్వుని తగ్గించుకోవాలంటే ఈ విధమైన టిప్స్ ని ఫాలో అవ్వండి. దీనితో పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. అయితే చాలామంది పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడం కష్టమని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా అనుసరిస్తే తప్పక పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది.
పెసరపప్పు:
పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గించడానికి పెసరపప్పు బాగా ఉపయోగపడుతుంది. అల్పాహారం సమయంలో పెసరపప్పును తీసుకుంటే చక్కటి బెనిఫిట్ పొందొచ్చు. ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది అలానే జీర్ణం కూడా త్వరగా అవుతుంది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీ కూడా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. ఊబకాయంతో బాధపడేవాళ్లు గ్రీన్ టీ తీసుకుంటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. అలానే క్యాన్సర్ రాకుండా కూడా గ్రీన్ టీ చూసుకుంటుంది.
పాలకూర:
పాలకూర కూడా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది. ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళకి పాలకూర బాగా ఉపయోగకరం.
కమలా:
పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడానికి కమల కూడా బాగా ఉపయోగపడుతుంది. కాళీ కడుపున కమల తినడం కానీ ఇన్ కమల జ్యూస్ తాగడం కానీ చేస్తే మంచిగా లాభాలు పొందొచ్చు.
అవిసె గింజలు:
అవిసె గింజల్లో విటమిన్-ఇ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఉంటాయి. అవిసె గింజల తో లడ్డూలు కానీ మరి ఏ ఇతర ఆహార పదార్థాలను కానీ తయారుచేసుకుని తీసుకోవచ్చు. ఇలా వీటిని తీసుకుని పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించుకోవచ్చు.