46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. ఎంత సంపద ఉందో తెలుసా?

-

ఒడిశాలోని పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గది 46 ఏళ్ల తర్వాత గురువారం రోజున తెరుచుకుంది. భారీ పెట్టెలు, అల్మారాల్లో ఉన్న జగన్నాథుని ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్కు తరలించారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల సమక్షంలో గురువారం ఉదయం 9.51 గంటలకు రహస్య గదిని తెరిచి సాయంత్రం 5.15 వరకు దశల వారీగా సంపదను స్ట్రాంగ్‌ రూమ్కు చేర్చారు.

రహస్య గదిలో పెద్ద పరిమాణంలో 3 పెట్టెలున్నాయని వాటిలో రెండు కలప, ఒకటి స్టీల్తో చేసినవని.. అలాగే 4 భారీ సైజు అల్మారాలు కూడా ఉన్నాయని జస్టిస్‌ రథ్, శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాడి తెలిపారు. వాటి వివరాలు బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేశామని.. అందుకే వాటిలో ఎంత సంపద ఉందో వెల్లడించలేమని స్పష్టం చేశారు. అయితే స్వామి సంపద మొత్తం భద్రంగా ఉందని హామీ ఇవ్వగలమని పేర్కొన్నారు. పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఈ భాండాగారం మరమ్మతులను చేపడుతుందని వివరించారు. స్వామివారి సంపదను తాత్కాలిక ఖజానాలో భద్రపరిచి సీల్‌ చేయించామని.. ఇదంతా వీడియోగ్రఫీ కూడా చేయించామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news