వాయనాడులో కొండచరియలు విరిగి 20 మంది మృతి చెందారు. ఈ తరుణంలో వాయనాడు ఘటనపై స్పందించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో నేను తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని…ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.
కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నాకు హామీ ఇచ్చారని వివరించారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని మరియు సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని కోరానన్నారు. నేను కేంద్ర మంత్రులతో మాట్లాడి వాయనాడ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరతాను…. రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్లలో అడ్మినిస్ట్రేషన్‌కు సహాయం చేయాలని నేను UDF కార్యకర్తలందరినీ కోరుతున్నానని తెలిపారు రాహుల్ గాంధీ.