రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. నైట్ డ్యూటీ అల‌వెన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం..!

-

రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌. నైట్ డ్యూటీ చేసే ఉద్యోగుల‌కు అల‌వెన్స్ ఇచ్చేందుకు రైల్వే శాఖ ప‌లు నియ‌మాల‌ను మార్చింది. బేసిక్ శాల‌రీ రూ.43,600 ఉండి నైట్ అల‌వెన్స్ పొంద‌ని వారికి అల‌వెన్స్ ఇవ్వ‌నున్నారు. ఈ మేర‌కు 7వ పే క‌మిష‌న్ సూచ‌న‌లు చేసింది.

railway decided to give night duty allowance

రాత్రి పూట చాలా మంది రైల్వే ఉద్యోగులు భిన్న విభాగాల్లో విధులు నిర్వ‌ర్తిస్తుంటారు. అందువల్ల వారికి నైట్ అల‌వెన్స్ ఉండాల్సిందే. ఈ క్ర‌మంలోనే రైల్వే ఎంప్లాయి యూనియ‌న్లు ఈ విష‌య‌మై సంబంధిత మంత్రిత్వ శాఖ‌కు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశాయి.

నార్త‌ర్న్ రైల్వేకు చెందిన ఢిల్లీ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనుప్ శ‌ర్మ మాట్లాడుతూ రాత్రి పూట ప‌నిచేసే రైల్వే ఉద్యోగుల‌కు నైట్ అల‌వెన్స్ ఇచ్చే విష‌యాన్ని స‌మీక్షించ‌డాన్ని ప్ర‌స్తుతం నిషేధించార‌ని అన్నారు. అయితే ప‌లు కార్మిక యూనియ‌న్లు రైల్వే మంత్రిత్వ శాఖ‌ను ఈ విష‌య‌మై డిమాండ్ చేశాయ‌ని, ఉద్యోగుల‌కు నైట్ అల‌వెన్స్ ఇవ్వాల‌ని కోరాయ‌ని అన్నారు. అయితే నైట్ అల‌వెన్స్ ఇవ్వ‌ని ప‌క్షంలో రాత్రి పూట ప‌నిచేయించుకోరాద‌ని కూడా యూనియ‌న్లు కోరాయ‌ని తెలిపారు.

కాగా నైట్ డ్యూటీ అల‌వెన్స్‌ను ఇచ్చేందుకు ప‌లు రూల్స్‌ను కూడా మార్చారు. అవి త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే అన్ని ప్ర‌భుత్వ విభాగాలు, మినిస్ట్రీల‌లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ఈ రూల్స్ వ‌ర్తిస్తాయి. ఇక రాత్రి పూట ప‌నిచేసే ఉద్యోగులు సూప‌ర్ వైజ‌ర్ నుంచి ప్ర‌త్యేక స‌ర్టిఫికెట్ తీసుకోవాలి. దాన్ని స‌మ‌ర్పిస్తే నైట్ అలవెన్స్ ఇస్తారు. గ్రేడ్ ఎ ఉద్యోగులు అల‌వెన్స్ పొంద‌వ‌చ్చు. రాత్రి 10 నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తేనే అల‌వెన్స్ ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news