బాలిక ఎదురుగా అబ్బాయి నగ్నంగా ఉండటం అత్యాచార యత్నం కాదు – రాజస్తాన్ హైకోర్టు

-

రాజస్తాన్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలిక లోదుస్తులు తొలిగించి.. బాలిక ఎదురుగా అబ్బాయి నగ్నంగా ఉండటం అనేది అత్యాచార యత్నం కాదంటూ రాజస్తాన్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 33 ఏళ్ల క్రితం నమోదైన అత్యాచార యత్నం కేసుపై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చింది తీర్పు. ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

Rajasthan High Court Taking Off Girls Underwear Is Not Rpe

రాజస్థాన్ రాష్ట్రం టోంక్ జిల్లాలోని తోడరైసింగ్ అనే ఊరిలో 1991లో ఓ ఆరు ఏళ్ల బాలిక రాత్రి 8గంటలకు నీరు తాగడానికి వచ్చిన సమయంలో ఆ బాలికను సువాలాల్ అనే వ్యక్తి పక్కనే ఉన్న ధర్మశాలకు తీసుకు వెళ్లి ఆ బాలిక లోదుస్తులు తొలి గించి.. సువాలాల్ కూడా బట్టలు విప్పి నగ్నంగా మారాడు. ఆ సమయంలో బాలిక కేకలు పెడుతూ ఏడ్వడంతో స్థానికులు వచ్చి రక్షించి నిందితుడిని పోలీసులకు పట్టించారు. ఈ కేసుపై 33 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడగా.. రాజస్థాన్ హైకోర్టు బాలిక లోదుస్తులు తొలిగించి.. అబ్బాయి తన దుస్తులు తొలగించుకొని నగ్నంగా ఉండటం.. అత్యాచార యత్నం కాదని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version