అలర్ట్.. బ్యాంక్ లాకర్స్ వాడేవారికి RBI లేటెస్ట్ గైడ్‌లైన్స్‌..!

-

చాలామంది బ్యాంకుల్లో విలువైన వాటిని దాచుకుంటుంటారు. డాక్యుమెంట్లు, నగలు వంటి విలువైన వస్తువుల్ని బ్యాంకుల్లో స్టోర్ చేస్తే ఏ భయం కూడా ఉండదు. బ్యాంకు లాకర్ ఫెసిలిటీని చాలామంది వాడుకుంటూ ఉంటారు. బ్యాంకులో ఒకరు ఎంతటి విలువైన వస్తువులకైనా సేఫ్ గా ఉంటుంది. బ్యాంకులు ప్రజల వస్తువుల్ని రక్షించుకోవడానికి స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉపయోగిస్తారు. ఉన్న ప్రాంతాన్ని కెమెరాలతో పర్యవేక్షిస్తాయి ఎవరైనా ఓపెన్ చేస్తే అలారం మోగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ప్రస్తుతం వర్తించే రూల్స్ గురించి ఇప్పుడు చూద్దాం. లాకర్లలో ఏం స్టోర్ చేసుకోవచ్చు, ఏం చేయకూడదు అనేది కూడా ఇప్పుడు చూద్దాం.

వస్తువుల్లో ఏదైనా దొంగతనానికి గురైనా లేదంటే ఆ వస్తువు కనపడకుండా పోయిన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు వంటివి కూడా చూద్దాం. బ్యాంకుకు వెళ్లి లోపలికి సంబంధించిన కొత్త ఒప్పందంపై సంతకం చేయాలి. ఇవి ఒప్పందంలో లాకర్ ని ఎంతకాలం ఉపయోగించుకుంటున్నారో ఎలాంటి నిబంధనలకు అంగీకరిస్తున్నారు వంటి విషయాలు ఉంటాయి. కొత్త ఒప్పందంపై సంతకం చేసాక 2023 డిసెంబర్ 31 కి ముందు బ్యాంకులకు ఇవ్వాలి. బ్యాంకులో ఒకరు సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి ముందు ఆ బ్యాంకులో ఒక సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి.

లాకర్ తీసుకునేటప్పుడు పాన్ కార్డు ఆధార్ కార్డు వంటి ఐడెండిటీ ప్రూఫ్ కూడా ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో కూడా తీసుకుంటారు. కావాల్సిన ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత బ్యాంకు ఒక డాక్యుమెంట్ ఇస్తుంది. ఈ డాక్యుమెంట్లలో లాకర్ ను ఎలా ఉపయోగించాలి..?, ఏం చేయాలి అనే విషయాలు స్పష్టంగా ఉంటాయి. లాకర్లు చిన్నవి పెద్దవి అని రకరకాల సైజుల్లో ఉంటాయి. వేటిని ఎవరికి ఇవ్వాలి అనేది బ్యాంకు నిర్ణయిస్తుంది. బ్యాంకు కొంత డబ్బు అడిగి లాకర్ ఇస్తుంది.

ఈ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ గా ఇవ్వచ్చు. లేదంటే క్యాష్ గా ఇవ్వచ్చు. లాకర్ లో ఉంచిన వస్తువులు పోతే తాము బాధ్యత వహించలేము అని బ్యాంకులు చెప్తాయి. అందుకే వాటికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కస్టమర్ మరణించిన సందర్భంలో లాకర్ తెరిచే రైట్ ఎవరికి ఇవ్వాలి అని బ్యాంక్ అడుగుతుంది. దీనిని నామినీ అని అంటారు. బ్యాంకు పొరపాటు కారణంగా నష్టం జరిగితే బ్యాంకు పరిహారం ఇవ్వాలి

Read more RELATED
Recommended to you

Exit mobile version