తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

-

తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ తాజాగా విడుదల అయింది. ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా తుది కీ ని విడుదల చేశారు. విడుదల చేసిన తుది కీ ని అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ ని స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్ పోస్టుల కోసం సంబంధిత అధికారిక  http://tgdsc.aptonline.in/tgdsc/finalkey వెబ్ సైట్ లో ఉంచారు.ఫైనల్ కీ ద్వారా డీఎస్సీ అభ్యర్థులు తమ మార్కులను తెలుసుకోవచ్చు. త్వరలోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో డీఎస్సీ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భరీ కోసం డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version