రిటైల్ చెల్లింపుల కోసం పాన్-ఇండియా ఫ్రేం వర్క్ ని లాంచ్ చేసిన ఆర్బీఐ…!

-

రిటైల్ చెల్లింపుల సంస్థలను అన్నింటిని ఒక గోడుగు కిందకు తీసుకు రావడానికి గానూ పాన్ ఇండియా లెవల్ లో ఫ్రేం వర్క్ ను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, 500 కోట్ల రూపాయల నికర విలువ కలిగిన కంపెనీలు అన్నీ ఈ పరిధిలోకి రావడానికి అర్హులు అని తెలిపింది. అదే విధంగా రిటైల్ చెల్లింపుల వ్యవస్థలో కొత్త చెల్లింపులను ఏర్పాటు చేసుకోవడానికి గానూ అనుమతి ఉంటుంది.

ఏటీఎంల ఏర్పాటు వంటివి చేసుకోవచ్చు. ఆధార్ ఆధారిత చెల్లింపులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలను నివారించడానికి గానూ దీనిని ప్రవేశ పెడుతున్నారని తెలుస్తుంది. ఫిబ్రవరి 2021 నాటికి దరఖాస్తులను పంపాలని సూచనలు చేసింది. ఒకే గొడుగు కిందకు వచ్చే కంపెనీల యజమానులు భారత పౌరులు కావాలి అనే నిబంధన కూడా పెట్టింది. చెల్లింపుల వ్యవస్థకు గానూ అర్ధవంతమైన వ్యాపారాలు ఉండాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news