షిర్డీ సాయిబాబాకు రికార్డు స్థాయిలో ఆదాయం

-

సుప్రసిద్ధ షిర్డీ సాయిబాబా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 వరకు నెలన్నర వ్యవధిలో.. వివిధ రూపాల్లో రూ. 47 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవధిలో 26 లక్షల మంది భక్తులు సాయినాథుడ్ని దర్శనం చేసుకున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరు 30 వరకు 2వేల నోట్లు చలామణిలో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నెలన్నర సమయంలో.. సాయి భక్తులు రూ. 2.4 కోట్ల విలువైన 2వేల నోట్లను సమర్పించారు. ఈ మేరకు సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.శివశంకర్ వివరాలు వెల్లడించారు.

సాయిబాబాకు వచ్చిన కానుకలు..

  • విరాళాలు – రూ. 25.89 కోట్లు
  • హుండీ ఆదాయం- రూ. 9.83 కోట్లు
  • మనీయార్డర్ ద్వారా – రూ. 27. 37 లక్షలు
  • రెండు కిలోల బంగారం – రూ. 1.17 కోట్లు
  • 52 కిలోల వెండి – రూ. 28.49 లక్షలు
  • డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా – రూ. 5.15 కోట్లు
  • ఆన్‌లైన్ విరాళం – రూ. 3. 34 కోట్లు
  • చెక్కులు, డీడీల ద్వారా – రూ.1. 82 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news