దేశం లో కార్ల ధరలు పెంచడానికి కార్ల కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పెంచిన ధర లతో కార్లు అందుబాటు లోకి వస్తాయని పలు కార్ల కంపెనీలు ప్రకటించాయి. ఇప్పటి కే మారుతీ సుజుకీ, మెర్సిడెస్, ఆడి సంస్థలు తమ కార్ల ధర లను జనవరి 1 నుంచి పెంచుతున్నట్టు ప్రకటించాయి. అయితే ధర పెంపు అనేది కార్ మోడల్ ను బట్టి ఉంటుందని మారుతీ సుజుకీ తెలిపింది. అయితే కార్ల తయారీ లు వాడే ముడి వస్తువల ధరలు విపరీతం గా పెరుగుతున్న నేపథ్యం లో నే కార్ల ధరలు పెంచుతున్నామని ఆయా కార్ల కంపెనీలు తెలిపాయి.
అయితే ముడి వస్తువల ధరలు పెరగడం వల్ల కార్ల తయారీ లో పెను మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. కమోడిటీల ధరలు భారీగా పెరిగన నేపథ్యం లో కార్ల పెంపు కూడా విపరీతం గా పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజజుకీ సీనియర్ ఈ డీ శశాంక్ శ్రీ వాస్తవ తెలిపారు. అయితే జనవరి 1 నుంచి మెర్సిడెస్ కంపెనీ దాదాపు 2 శాతం పెంచే అవకాశం ఉంది. అలాగే ఆడి కంపెనీ కూడా దాదాపు 3 శాతం పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎది ఏమైనా.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి.