దైవ దర్శనానికి వెళ్తుండగా.. లారీ ఢీకొని 8 మంది దుర్మరణం

-

పంజాబ్​లో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలినడకన వెళ్తున్న యాత్రికులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది యాత్రికులు దుర్మరణం చెందారు. అనేక మంది గాయపడ్డారు. హోషియార్​పుర్​ జిల్లా గర్​శంకర్​ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందిసమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బైశాఖీ పర్వదిన వేడుకల్లో పాల్గొనేందుకు సుమారు 50 మంది భక్తులు చరణ్ ఛో గంగా వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వారిని ఢీకొట్టిందని జరిగందని గర్​శంకర్​ డీఎస్​పీ దల్జిత్ సింగ్ ఖాఖ్ వెల్లడించారు. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారని.. వీరంతా ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్‌నగర్‌ జిల్లాలోని మస్తాన్​ ఖేరా ప్రాంతానికి చెందినవారిగా గుర్తించామని చెప్పారు.

ఘటన జరిగిన స్థలం పర్వత ప్రాంతం కావడం వల్ల లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్​ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. కేసు నమోదు చేసుకుని డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news