రైతులకు కేంద్రం శుభవార్త.. ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువులపై రూ.60వేల కోట్ల సబ్సిడీ

-

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ ఆ భారాన్ని రైతులపై కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు కొనుగోలు చేసే డిఎపి, పాస్పటిక్, పొటాషియం ఎరువులపై ఏకంగా 60 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. DAP బస్తా పై ప్రస్తుతం 1650 సబ్సిడీని రూ.2501 పెంచింది. ఇది గత ఏడాది కంటే 50 శాతం అధికమని పేర్కొంది. డీఏపీ ధర లు దాని ముడి సరుకు ధరలు దాదాపు 80శాతం మేర పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఆ రాయితీని పెంచింది.

దీనివల్ల రైతులకు నోటిఫై చేసిన పస్పాటిక్ అలాగే పొటాష్ ఎరువులు అందుబాటు ధరల్లో లభిస్తాయని తెలిపింది. పోషక ఆధారిత రాయితీ రూపంలో రైతులకు ఎరువులను సరఫరా చేస్తారు. దీనివల్ల రైతులు అందరికీ అవసరమైన ఎరువులు ఇబ్బందులు లేకుండా అందుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news