దారుణం… 10 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి..!

-

పదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన లోకేశ్వరం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మండలంలోని ఖడ్గం గ్రామ కాలనీకి చెందిన ఓ వృద్ధుడు ఈనెల 24వ తేదీన అదే కాలనీకి చెందిన.. ఓ బాలిక బహిర్ముఖుకి వెళ్లడం గమనించి ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఆ తర్వాత బాలికను బంధించి లైంగికదాడి చేశాడు. అనంతరం ఆ బాలికను వదిలిపెట్టాడు. కానీ ఈ విషయాన్ని భయపడి ఇంట్లో చెప్పలేదు ఆ బాలిక. అయితే… మొన్నటినుంచి కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లారు కుటుంబసభ్యులు. దీంతో అసలు విషయం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు లోకేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఆ వృద్దుడి పై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు. ఇక ఈ ఘటన వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news