కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా.. రూ.75 స్మారక నాణెం విడుదల!

-

భారత పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి రంగం రెడీ అయింది. మే 28న జరిగే వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్‌ను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని రెండు దశలుగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 28న ప్రధాన మంత్రి మోదీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభిస్తున్న సందర్భానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ.75 విలువైన స్మారక నాణెంను విడుదల చేయనుంది. ఆర్థిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన అధికారిక  సమాచారం మేరకు నాణెం 34.65 గ్రాముల నుంచి 35.35 గ్రాముల బరువు ఉండనుంది.

నాణేనికి ఒకవైపున మూడు సింహాల గుర్తు, మధ్యలో దేవనాగరి లిపిలో ‘భారత్‌’ అని.. ఇంగ్లిష్‌లో ‘ఇండియా’ అని ఉంటాయి. అలాగే రూపాయి గుర్తు ‘ Rs ’, నాణెం విలువను సూచిస్తూ ‘75’ సంఖ్య అడుగు భాగాన ముద్రిస్తారు. నాణెం రెండో వైపున పార్లమెంటు భవనం బొమ్మ, సంవత్సరాన్ని సూచిస్తూ ‘2023’ ను ముద్రిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news