మీ కృషికి ఫలితమే ఇది మోదీ జీ.. ప్రధానిపై పుతిన్ ప్రశంసలు

-

ప్రధాని మోదీ రష్యా పర్యటన కొనసాగుతోంది. సోమవారం మోదీ ఆ దేశానికి చేరుకోగా ఘనస్వాగతం లభించింది. అనంతరం ప్రధాని మోదీకి అధ్యక్షుడు పుతిన్‌ నోవో ఓగర్యోవోలోని తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. తన ఇంటికి వచ్చిన మోదీకి ఆయన ఘనంగా స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. పుతిన్, మోదీ కాసేపు పలు విషయాలపై చర్చించుకున్నారు.

రష్యా పర్యటనలో ఉన్న మోదీపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. చరిత్రాత్మక స్థాయిలో మూడోసారి గెలుపొందారన్న పుతిన్.. మోదీ తన జీవితాన్ని భారత ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. ఎన్నో ఏళ్లుగా మీరు చేసిన కృషికి ఫలితం ఇది అని తాను భావిస్తున్నానని పుతిన్ పేర్కొన్నారు. “మీరు చాలా శక్తిమంతమైన వ్యక్తి” అని మోదీని పుతిన్ ప్రశంసలతో ముంచెత్తారు. పుతిన్ మాటలతో.. భారత ప్రజలు మాతృభూమికి సేవ చేసే అవకాశం మరోసారి తనకు ఇచ్చారని ప్రధాని మోదీ ఎన్నికల ఫలితాలను గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news