రష్యాతో వ్యాపారాన్ని నిలిపేసిన టాటా స్టీల్, ఇన్ఫోసిస్

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా తీవ్ర ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే అమెరికా, కెనడా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు రష్యాపై పలు రకాల ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఇప్పటికే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను నిలివేశాయి. మైక్రోసాఫ్ట్, పూమా, గుగూల్, ఫేస్ బుక్ వంటి కంపెనీలు తమ సేవలను రష్యాలో నిలిపివేశాయి. అయితే రష్యాతో వ్యాపారానికి భారత్ దూరంగా ఉండాలని… పాశ్చాత్య దేశాలు ఎంతో ఒత్తడి తెస్తున్నా కూడా రష్యాతో భారత్ కు ఉన్న దశాబ్ధాల బంధానికి కట్టుబడి ఎలాంటి ఆంక్షలు విధంచలేదు. 

ఇదిలా ఉంటే భారత్ నేరుగా రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించకున్నా… కొన్ని కంపెనీలు రష్యాతో వ్యాపారాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా టాటా స్టీల్, ఇన్ఫోసిస్ కంపెనీలు రష్యాతో వ్యాపారానికి గుడ్ బై చెప్పాయి. వారి కార్యకలాపాలను రష్యా నుంచి బయటకు తరలించాలని నిర్ణయించాయి. ఇన్ఫోసిన్ తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే టాటా స్టీల్ కూడా రష్యాలో తన బిజినెస్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news