రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇన్నాళ్లు తూర్పు ప్రాంతంలోనే టార్గెట్ చేసిన.. రష్యన్ బలగాలు ప్రస్తుతం పశ్చిమ ప్రాంతాలను కూడా వదలడం లేదు. ఉక్రెయిన్ కు వచ్చే యుద్ధ సహయాన్ని, ఆయుధాలను అడ్డుకునేందకు రష్యా కొత్తగా ఈ ప్లాన్ వేసింది. పశ్చిమ నగరమైన ఎల్వివ్ నగరంపై వైమానికి దాడుల చేసింది రష్యా. ఈ ఘటనలో 9 మంది మరణించారు. పొలాండ్ కు సరిహద్దుల్లో ఉన్న ఈ నగరంపై దాడి చేసి ఉక్రెయిన్ ప్రధాన నగరాలను వశపరుచుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తం అయింది. ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలెండ్ కు తరలించేందుకు భారత విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆపరేషన్ గంగాలో ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం కీలకంగా వ్యవహరించింది. ప్రతీ ఒక్క భారతీయుడిని ఇండియాకు తరలించేందుకు సహయపడింది. అత్యంత పరిస్థితుల్లో సుమీ, ఖార్కీవ్ ప్రాంతాల నుంచి భారతీయులను పోలాండ్ , రొమేనియాకు తరలించి అక్కడ నుంచి భారత్ కు ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఈరోజు భారత ప్రధాని మోదీ నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.