జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నూతన అధిపతిగా మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎఫ్) చీఫ్ సదానంద్ వసంత్ దాతె నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఉత్తర్ ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్కు చెందిన వసంత్ దాతె, ముంబయి 26/11 ఉగ్రదాడి ప్రధాన నిందితులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్‌లను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. అంతే కాకుండా జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) అధిపతిగా అతుల్ కర్వాల్ స్థానంలో పీయూష్ ఆనంద్ను కేంద్రం నిమించింది.
ప్రస్తుతం ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా ఉన్న దినకర్ గుప్తా మార్చి 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో వసంత్ దాతెను నియమించారు. వసంత్ దాతె 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. 26/11 ఉగ్రదాడిగా పేరొందిన ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్‌లను పట్టుకున్న సయమంలో ఆయన ముంబయి అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్నారు.