అదిలాబాద్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిపై వివాదం…ఎస్టీకి బదులు ఎస్సీ ?

-

అదిలాబాద్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిపై వివాదం చోటు చేసుకుంది. ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్‌లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ. అదిలాబాద్ (ఎస్టీ) స్థానానికి రెండు సార్లు పెద్దపల్లి (ఎస్సీ) నుండి టీడీపీ టికెట్ మీద గెలిచిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చెల్లమల్ల సుగుణ కుమారి పేరుని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.

ఇప్పటికే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల టికెట్ల ఖరారులో వెనకబడ్డ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామం సరికొత్త అయోమయానికి దారి తీసింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో అభ్యర్థి పేరును మార్చి మళ్ళీ కొత్త జాబితాను విడుదల చేసింది. కాగా, అదిలాబాద్ నుంచి సుగుణ కుమారి చెలిమలను ఎంపీ బరిలో ఉంచారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు పేరును ఖరారు చేశారు.భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైనల్‌ అయ్యారు. ఈ మేరకు నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటన చేసింది అధిష్టానం.

 

Read more RELATED
Recommended to you

Latest news