పథకం ప్రకారమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి పాల్పడ్డారు: కిషన్ రెడ్డి

-

సికింద్రాబాద్ స్టేషన్ అగ్నిగుండంగా మారడం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ముందస్తు పథకం ప్రకారమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. అగ్నిపధ్ పై యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం సరికాదని స్పష్టంచేశారు. కుట్రపన్ని రైల్వే స్టేషన్ ను లక్ష్యంగా ఎంచుకోవడం దారుణమని పేర్కొన్నారు. రైలు బోగీలకు నిప్పు పెట్టారని,భోగీలను ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి వెల్లడించారు.

రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని, రైల్వేస్టేషన్ ప్రాంగణంలోని ప్రయాణికుల బైక్ లను తగులబెట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారని, వారికి బాధ్యత లేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. అగ్నిపథ్ నియామక విధానం పై కేంద్రం ప్రకటన ఏకపక్ష నిర్ణయం కాదని, ప్రపంచ దేశాల్లో పరిస్థితులన్నీ పరిశీలించిన మీదటే తీసుకున్న నిర్ణయం అని ఉద్ఘాటించారు. అగ్నిపధ్ పై రాష్ట్ర ప్రభుత్వాలతోనూ మాట్లాడమని వివరించారు. తాజాగా అగ్నిపధ్ లో గరిష్ట వయోపరిమితి 23 ఏళ్లకు పెంచామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news