ప్రధాని మోదీకి పోస్టులో రాఖీ పంపిన సీమా హైదర్‌

-

పబ్జీ ఆటలో పరిచయమైన ప్రేమికుడి కోసం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన పాక్‌ జాతీయురాలు సీమా హైదర్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈమె ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితర ప్రముఖులకు రాఖీలు పంపింది. ఈ నెల 30వ తేదీన రక్షాబంధన్‌ పండగ సందర్భంగా వారందరికీ తాను రాఖీలు పంపానని ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది.

‘రక్షాబంధన్ వస్తోంది. అందుకే నేను రాఖీలను పోస్టులో పంపించాను. ఈ దేశ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నా సోదరులకు అవి సకాలంలో చేరుతాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. జై శ్రీరాం. జై హింద్‌, హిందుస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ సీమా ఆ వీడియోలో మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరో వీడియోలో సీమా హైదర్‌ తన పిల్లలతో కలిసి రాఖీలను ప్యాక్‌ చేస్తూ కనిపించింది. ‘భయ్యా మేరే రాఖీ కే బంధన్‌ కో నిభానా’ అనే రక్షాబంధన్‌ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news