ఖచ్చితంగా స్త్రీలు గాజులు వేసుకోవాలి.. ఎందుకు అంటే..?

-

మన పెద్దలు మహిళలు కచ్చితంగా గాజులు వేసుకోవాలని చెప్తూ ఉంటారు. చేతులకి గాజులు వేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి మహిళా కూడా చేతికి గాజులు వేసుకోవాలి. పెళ్లయిన స్త్రీ చేతికి గాజులు వేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. గాజులు మనకు రక్షణగా ఉంటాయి స్త్రీలు చేతులకి గాజులు వేసుకుంటే ఏ కీడు జరగదట. అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులు వేస్తుంటారు అలా చేయడం వలన దిష్టి తగలదు దోషాలు వంటివి కూడా రావు.

గాజుల శబ్దం సంతోషాన్ని కలిగిస్తాయి ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు చేతికి నిండుగా గాజులు ధరిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుందని కూడా అంటుంటారు. రకరకాల రంగురంగుల గాజులు మనకి అందుబాటులో ఉంటాయి ఆ రంగులకి కూడా రకరకాల అర్థాలు ఉన్నాయి. ఊదా రంగు స్వేచ్ఛను సూచిస్తుంది. పసుపు రంగు సంతోషాన్ని సూచిస్తుంది. అలానే నీలం రంగు విజ్ఞానాన్ని ఆకుపచ్చ అదృష్టాన్ని సూచిస్తాయి.

ఇలా గాజుల రంగులు వెనక కూడా చక్కని అర్ధాలు ఉన్నాయి సౌభాగ్యానికి గాజులు చిహ్నం బంగారం గాజులు చేతికి ఉన్నప్పటికీ ఒక్క మట్టి గాజు అయినా సరే వేసుకుంటూ ఉంటారు ఆడవాళ్లు. కుంకుమతో పాటు గాజులను కూడా అమ్మవారికి పెట్టి పూజిస్తారు. మట్టి గాజులు వేసుకుంటే ముత్తయిదువుతనాన్ని అది సూచిస్తుంది గాజులను వేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందంటారు కూడా. కాబట్టి పెళ్లయిన ప్రతి స్త్రీ కూడా గాజులు వేసుకోవాలి ఆడపిల్లలు కూడా గాజులు వేసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news