కంగనా ఆఫీస్ కూల్చివేత.. శివసేనకు ఎలాంటి సంబంధం లేదు..!

-

ముంబైలోని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఆఫీసును బృహ‌న్‌ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ బంగ్లాలో అక్ర‌మ మార్పులు జరగడంతో ఇంటికి నోటీసులు అంటించిన‌ట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే త‌న బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన ఫోటోల‌ను కంగ‌నా ట్వీట్ చేసి, ‘నేనెప్పుడూ త‌ప్పు చెప్ప‌లేదు, ముంబై పీవోకేనే అని నా శ‌త్రువులు మరొకసారి ప్రూవ్ చేశారు’ అని ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై ఆమె నిప్పులు కురిపించారు. “ఉద్ధవ్ థాకరే… ఏమనుకుంటున్నావ్?. సినీ మాఫియాతో చేతులు కలిపి నా ఇల్లు కూల్చేసి నాపై ప్రతీకారం తీర్చుకున్నారా? ఇవాళ నా ఇల్లు కూలిపోయింది… రేపు మీ అహంకారం కూలిపోతుంది” అంటూ నిప్పులు చెరిగారు.

అయితే తాజాగా.. దీనిపై శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు. కంగన కార్యాలయం కూల్చివేతతో శివసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సంజయ్ స్పష్టం చేశారు. కూల్చివేతను చేపట్టింది బీఎంసీ అని, ఏదైనా అడగాలంటే మేయర్ లేదా బీఎంసీ కమిషనర్‌ను అడగండి  అని సంజయ్ రౌత్ తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news