రామ జన్మభూమి ట్రస్టుకు చెందిన అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి భారీగా సొమ్ము మాయం అయినట్టు గుర్తించారు. సెప్టెంబర్ 1వ తేదీన లక్నోలోని బ్యాంకు నుంచి రూ.6 లక్షల రూపాయలు, మరో రెండు రోజుల తరువాత మూడున్నర లక్షల రూపాయలను ట్రస్ట్ చెక్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు విత్ డ్రా చేసినట్టు తెలుస్తోంది.
మూడోసారి ఏకంగా 9.86 లక్షల రూపాయలకు టోకరా వేయబోగా ఈ సారి పెద్ద మొత్తం డబ్బు కావడంతో బ్యాంకు అధికారులకు సందేహం వచ్చి ట్రస్ట్ సభ్యులకు ఫోన్ చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పై రామ జన్మభూమి ట్రస్టు సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో అయోధ్య పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన మీద దర్యాప్తు మొదలు పెట్టారు. ట్రస్ట్ కి సంబందించిన చెక్ లు అసలు బయట వ్యక్తుల వద్దకు ఎలా వెళ్ళాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.