సామాన్యుల‌కు షాక్.. మ‌రోసారి పెర‌గ‌నున్న సిమెంట్ ధ‌ర‌లు..!

-

సిమెంట్ ధ‌ర‌లు మ‌రోసారి సామాన్యుల‌కు షాక్ ఇవ్వ‌డానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్ప‌టికే భారీ పెరిగిన సిమెంట్ ధ‌ర‌లు.. మ‌ళ్లీ పెర‌గ‌బోతున్న‌ట్టు ప్ర‌ముఖ రేటింగ్స్ సంస్థ క్రిసిల్ అంచ‌నా వేసింది. ప్ర‌తి బ‌స్తాకు రూ. 25 నుంచి రూ. 50 వ‌ర‌కు ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని క్రిసిల్ సంస్థ అభిప్రాయ ప‌డుతుంది. దేశంలో సిమెంట్ కు ఉన్న డిమాండ్ తో పాటు ఉక్రెయిన్ – ర‌ష్యా మ‌ధ్య వార్ కార‌ణంగా సిమెంట్ బ‌స్తాల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి.

క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తి త‌ర్వాత దేశంలో సిమెంట్ కు డిమాండ్ విప‌రీతంగా పెరిగింది. దీంతో సిమెంట్ కొర‌త ఏర్పాడింది. దీంతో సిమెంట్ తో పాటు స్టీల్ ధ‌ర‌లు కూడా భారీ గా పెరిగాయి. దీనికి తోడుగా.. ఉక్రెయిన్ – రష్యా యుద్దం రావ‌డంతో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కూడా పెరిగాయి.

దీని ప్ర‌భావం సిమెంట్ మూడి ప‌ద‌ర్థాల‌పై ప‌డింది. గ‌త ఆరు నెల్ల‌ల్లో సిమెంట్ ఉత్ప‌త్తిలో వాడిన పెట్ కోక్ ధ‌ర‌లు 30 నుంచి 55 శాతానికి పెరిగాయి. అలాగే బ‌స్తా సిమెంట్ ధ‌ర రూ. 390 వ‌ర‌కు చేరింది. తాజా గా మ‌రో రూ. 50 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news