తెలుగు సినిమా అభిమానులు అందరూ ఈగర్ గా ‘ఆచార్య’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. తండ్రీ తనయులు చిరంజీవి-రామ్ చరణ్ లను వెండితెరపైన అలా చూసి ఆనంద పడాలని అనుకుంటున్నారు. అయితే, ఈ ఆత్రుత, ఎదురుచూపులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.. అగ్రరాజ్యం అమెరికాలోని తెలుగు సినీ అభిమానులు కూడా ఈగర్ గా ‘ఆచార్య’ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. కాగా, అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఈ నెల 28న ఆచార్య ప్రీమియర్స్ వేయనున్నారు. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం..రీగల్ మూవీస్, సినీ మార్క్, ఏఎంసీ థియేటర్స్ అన్ని కలుపుకుని దాదాపు 400 ప్లస్ థియేటర్లలో 3,200కు పైగా స్క్రీన్స్ లో ‘ఆచార్య’ పిక్చర్ ప్రీమియర్స్ వేయనున్నారు.
ఈ విషయం తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. చిరంజీవి అంటే అలానే ఉంటుందని ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పుడే మెగా ఫ్యాన్స్ సంబురాలు షురూ చేశారు.
సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ‘ఆచార్య’ అదిరిపోతదని అంటూ హ్యాష్ ట్యాగ్ ఆచార్య అనే వర్డ్ ట్వీట్ చేశారు. అలా సదరు హ్యాష్ ట్యాగ్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వి్ట్టర్ లో ట్రెండింగ్ లోకి రావడం విశేషం.
Thanks to all chains for accommodating large format & max screens. @Cinemark @RegalMovies @AMCTheatres @Marcus_Theatres @EmagineTheatres @Kerasotes @CineLoungeusa @AppleCinemas @HarkinsTheatres @bbtheatres @GalaxyTheatres #Chiranjeevi #RamCharan pic.twitter.com/XNyaXZPogp
— PrimeMedia (@PrimeMediaUS) April 20, 2022