కర్ణాటకలో మాజీ ప్రధాని, జేడీఎస్ వ్యవస్థాపకుడు దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ.. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు. ఆయన మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఉన్న అసభ్య దృశ్యాల క్లిప్పింగ్స్ హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి. అయితే రేవణ్ణ పేరు చెడగొట్టగానికి నవీన్ గౌడ మరికొందరు కలిసి ఈ క్లిప్‌లను వ్యాప్తి చేశారని జేడీఎస్-బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ పూర్ణచంద్ర గౌడ ఇప్పటికే ఫిర్యాదు చేశాడు. ఆ మార్ఫ్‌డ్ వీడియోను హసన్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నవీన్ మరికొందరు ఓటర్లకు పంపించారని తెలిపారు.
ఈ నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ప్రజ్వల్ రేవణ్ణకు ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న అసభ్య వీడియో కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ నాగలక్ష్మీ చౌధరీ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రజ్వల్ రేవణ్ణ…హసన్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చే/గా.. అక్కడ ఈనెల 26న పోలింగ్ జరిగింది.