బిహార్​లో ముక్కు లేని వింత శిశువు జననం

బిహార్​ మోతిహరిలో ఓ వింత శిశువు జన్మించింది. అలీషెర్​పుర్​కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవి పురిటి నొప్పులతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా ఆమెకు ముక్కు లేని శిశువు పుట్టింది. ముక్కు స్థానంలో వింత ఆకారంలో రెండు కళ్లు ఉండగా.. శ్వాస తీసుకోవటానికి రంధ్రం కూడా లేదు. డాక్టర్స్ ఆ శిశువుకు నోట్లో ఆక్సిజన్ పైపు పెట్టి చికిత్స అందిస్తున్నారు. వింత ఆకారంలో ఉన్న శిశువును చూసేందుకు జనాలు తరలివస్తున్నారు. ఆ శిశువును చూసి కొంత మంది వినాయకుడు అంటుండగా.. మరికొంతమంది గ్రహాంతరవాసి అంటున్నారు.

తల్లిదండ్రుల జన్యుపరమైన లోపాల కారణంగా క్రోమోజోమ్​ల లోపాలతో శిశువులు ఇలా పుడతారని గైనకాలజిస్ట్ డాక్టర్ హేమచంద్ర తెలిపారు. “గర్భదారణ సమయంలో తప్పనిసరిగా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలి. గ్రామాల్లో చాలా మంది పరీక్షలు చేయించుకోవట్లేదు. సరైన పోషకాహారం కూడా తీసుకోవట్లేదు. ఇలాంటి వాళ్లకోసమే ప్రభుత్వం అంగన్​వాడీ, ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఇవి గర్భిణీలు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాలను నివారించి ఆరోగ్యవంతమైన శిశువు జననాలకు తోడ్పడుతున్నాయి. అయినా కూడా చాలా మంది వాటిని సంప్రదించకుండా ఇంకా పాతకాలపు పద్ధతులనే పాటించటం వల్ల ఇలా లోపాలతో పిల్లలు పుడుతున్నారు” అని డాక్టర్ చెప్పారు.