హిజాబ్ తో పరీక్షా కేంద్రాలలోకి అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థినులు

-

హిజాబ్ తో పరీక్షా కేంద్రాలలోకి అనుమతించాలని కర్ణాటక కు చెందిన పలువురు విద్యార్థినులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యాసంస్థలలో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దారి తీసిన విషయం తెలిసిందే. గతంలో హిజాబ్ తో కాలేజీలకు రావడానికి అడ్డుకున్నందుకు కొందరు విద్యార్థినులు పరీక్షలను కూడా బహిష్కరించారు.

అయితే తాజాగా హిజాబ్ ను అనుమతించాలని కోరుతూ తమ పిటిషన్ పై అత్యవసర విచారణ కోసం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలో ప్రీ యూనివర్సిటీ పరీక్షలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బాలికలను పరీక్షలకు అనుమతించకపోతే ఒక సంవత్సరం నష్టపోతారని, అత్యవసర జాబితాను కోరుతూ న్యాయవాది షాజన్ ఫరస్ట్ భారత ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారత ప్రధాని న్యాయమూర్తి చంద్రచూడ్ ఈ విషయాన్ని పరిశీలించి, బెంచ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news