కేంద్ర ప్రభుత్వ స్కీమ్.. రూ.100 తో.. ప్రతీ నెలా రూ. 57 వేలు..!

-

కేంద్ర ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. చాలా మంది వీటి వలన లాభాలని పొందుతున్నారు. దేశ ప్రజల కోసం చాలా రకాల సంక్షేమ పథకాలను కేంద్రం తెచ్చింది. అందులో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్‌ ద్వారా మంది ఎన్నో లాభాలని పొందుతున్నారు. దీనిలో పొదుపు చేస్తే పదవీ విరమణ తర్వాత నెల నెల పెన్షన్ మీకొస్తుంది. 25 ఏళ్ల వయసున్న వ్యక్తి నెలకు రూ. 1500 పొదుపు చేసుకుంటే.. 75 ఏళ్ల వయసు వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసి మంచిగా పెన్షన్ ని పొందవచ్చు. నెలకు రూ. 1500 అంటే రోజుకు రూ. 50.

60 ఏళ్లు వచ్చేటప్పటికి వార్షిక రిటర్న్ 10 శాతం కనుక ఉంటే మొత్తం కార్పస్ సుమారు రూ. 57 లక్షల 42 వేల 416 అవుతుంది. 100 శాతం కార్పస్ తో యాన్యూటీ ప్లాన్ కొనుగోలు చేసుకోవచ్చు. మొత్తం డబ్బులు తో యాన్యూటీ ప్లాన్ కొనుగోలు చేస్తే నెల నెల రూ. 28,712 పెన్షన్ మీకొస్తుంది. పెట్టుబడి మొత్తంలో 40 శాతం మాత్రమే యాన్యూటీ ప్లాన్ కోసం ఖర్చు చేస్తే నెలకు పెన్షన్ సుమారూ రూ. 11, 485 వస్తుంది. రూ. 34 లక్షల వరకు డ్రా చెయ్యచ్చు.

ఇక ఎంత వస్తుందనేది చూస్తే .. 25 ఏళ్ల వయసు వారు రోజుకు రూ.100 అంటే నెలకు రూ.3000 పొదుపు చేస్తే.. 60 ఏళ్లు వచ్చే సరికి 10 శాతం రాబడితో కార్పస్ రూ. 1 లక్షా 14 వేల 831 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో 100 శాతం కార్పస్ తో కనుక మీరు యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేస్తే నెలకు రూ. 57 వేలు పెన్షన్ వస్తుంది. 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే నెలకు రూ. 22 వేల 970 పెన్షన్. మిగిలిన రూ. 68 లక్షలు విత్ డ్రా చెయ్యచ్చు. 10 శాతం రిటర్న్స్ అనేది పెరగొచ్చు లేదంటే తగ్గొచ్చు. గడిచిన 10 ఏళ్ల కాలానికి చూస్తే ఈక్విటీ కేటగిరీలో 13 శాతం రిటర్న్స్. ఇతర స్కీమ్స్‌లో 9 శాతం రిటర్న్స్ వస్తాయి. యావరేజ్‌గా 10 శాతానికి పైనే రిటర్న్స్ ని మీరు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news