సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు.. ఎన్‌డీఏ ఎగ్జామ్ రాసేందుకు మ‌హిళ‌ల‌కు అనుమ‌తి..

-

నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్డీఏ) ఎగ్జామ్ విష‌య‌మై భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్చు ఇచ్చింది. ఇండియ‌న్ ఆర్మీలోకి మ‌హిళ‌ల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డంపై సుప్రీం కోర్టు త‌ప్పు ప‌ట్టింది. ఇంకా లింగ వివ‌క్ష‌త‌ను ప్ర‌ద‌ర్శించడం స‌రికాద‌ని పేర్కొంది. ఎన్‌డీఏ ఎగ్జామ్స్ రాసేందుకు మ‌హిళ‌ల‌ను అనుమ‌తిస్తూ తీర్పు ఇచ్చింది.

ఎన్‌డీఏ ఎగ్జామ్స్‌, సైనిక్ స్కూల్స్, మిలిట‌రీ ఇనిస్టిట్యూట్‌ల‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశాన్ని నిషేధిస్తూ ఇండియ‌న్ ఆర్మీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును సుప్రీం కోర్టు త‌ప్పుబ‌ట్టింది. పురుషుల‌తోపాటు స్త్రీల‌కు అవ‌కాశాల‌ను క‌ల్పించాల్సిందేన‌ని అభిప్రాయ‌ప‌డింది.

కాగా ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 5వ తేదీన ఎన్‌డీఏ ఎగ్జామ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే ఇండియ‌న్ నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల‌లో ఇప్ప‌టికే మ‌హిళ‌లను అనుమ‌తిస్తున్నారు. కానీ ఆర్మీలోకి అనుమ‌తి లేదు. దీనిపై ఇండియ‌న్ ఆర్మీని సుప్రీం కోర్టు త‌ప్పుబ‌ట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news