ట్యాంకర్‌ మాఫియా నీటిని మింగేస్తుంటే ఏం చేస్తున్నారు?.. ఆప్​ సర్కార్​పై సుప్రీంకోర్టు ఫైర్

-

దిల్లీ ఎదుర్కొంటున్న నీటి సంక్షోభం విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా ధ్వజమెత్తింది. ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో ట్యాంకర్‌ మాఫియా కట్టడికి, నీటి వృథాను అరికట్టడానికి ఆప్‌ సర్కార్​ ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి మిగులు జలాలు విడుదల కోరుతూ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థన నేపథ్యంలో కోర్టు స్పందించింది.

ట్యాంకర్ మాఫియా విస్తృతంగా కనిపిస్తోందని.. ఆ నీటినంతా ఆ మాఫియా మింగేసిందని నీరు వృథా అవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, దీనిపై దిల్లీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి వస్తోన్న నీరు ఎటుపోతోందని నిలదీసింది. మీడియాలో ఆ దృశ్యాలను తాము చూస్తున్నామన్న సుప్రీం ధర్మాసనం వృథాను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగింది. కోర్టు ముందు ఎందుకు అసత్య ప్రకటనలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతే.. ఆ పని పోలీసులకు అప్పగిస్తామని వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news