బిగ్ బ్రేకింగ్: సుశాంత్, దిశాని చంపేశారు…!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మ హత్య వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా ఈ వ్యవహారంపై కాస్త సీరియస్ గానే ఉంది. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ ని చంపేశారు అనే ఆరోపణలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుశాంత్ సింగ్ స్నేహితుడు సునీల్ శుక్లా ఒక జాతీయ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక జాతీయ మీడియా ఈ విషయాన్ని బయట పెట్టింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ని అలాగే అతని మాజీ మేనేజర్ దిశ సాలియన్ ఇద్దరు హత్యకు గురయ్యారని అతను వెల్లడించాడు. దిశా ని ఆమె ఫ్లాట్ తెర్రాస్ మీద నుంచి కిందకు తోసేసారు అని ఆరోపించారు. తాను ముందు నుంచి కూడా వాళ్ళు ఇద్దరు ఆత్మహత్య చేసుకోలేదు అని చెప్తూనే ఉన్నాను అని అన్నాడు.