మోడీ పై అభిమానం.. బర్త్ డే కోసం కార్యకర్తలు ఏం చేశారో తెలుసా.?

ఈనెల 17వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు బీజేపీ కార్యకర్తలు అందరూ… మోడీ బర్త్ డే వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు అభిమానులు పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. మోడీ బర్త్ డే పురస్కరించుకుని తమిళనాడులోని కోయంబత్తూరులో బిజెపి కార్యకర్తలు ఏకంగా 70 కిలోల లడ్డూను సమర్పించారు. కోయంబత్తూర్ లోని శివన్ కామాక్షి అమ్మన్ ఆలయం లో ఈ 70 కేజీలు లడ్డును సమర్పించిన అనంతరం భక్తులకు పంచిపెట్టారు.

ఇక అంతే కాకుండా మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా… ఎంతోమంది అభిమానులు కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎంతోమంది నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ.. రక్తదాన శిబిరాలు చేపడుతున్నారు బిజెపి కార్యకర్తలు అభిమానులు. ఇక మరికొన్ని చోట్ల రేపు ప్రధాని బర్త్ డే ని ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు కార్యకర్తలు సిద్ధమైపోయారు.