స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్ : ఇండోర్ ఫ‌స్ట్ మూడో స్టానం లో విజ‌య‌వాడ 13 వ స్థానంలో హైద‌రాబాద్

-

ప‌ట్ట‌ణాభివృద్ధి విభాగంలో స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డు ల‌ను రాష్ట్రప‌తి రాం నాథ్ కోవింద్ విడుద‌ల చేశారు. ఈ ఏడాది కూడా ఇండోర్ మొద‌టి స్థానం లో నిలిచింది. అలాగే టాప్ 10 లో వ‌రుస‌గా ఇండోర్, సూరత్, విజయవాడ, నవీ ముంబై, పుణే, రాయ్‌పూర్, భోపాల్, వడోదర, విశాఖపట్నం, అహ్మదాబాద్ న‌గ‌రాలు ఉన్నాయి. ఆంధ్ర ప్ర‌దేశ్ నుంచి రెండు ప‌ట్ట‌ణాలు టాప్ 10 చోటు ద‌క్కించుకున్నాయి. ఈ స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్ లో దాదాపు 4320 న‌గ‌రాలు, పట్ట‌ణాలు పాల్గొన్నాయి. అలాగే తెలంగాణ నుంచి హైద‌రాబాద న‌గ‌రం 13 వ స్థానంలో నిలిచింది.

అలాగే 50 వేల నుంచి ల‌క్ష లోపు జ‌నాభ ఉన్న ప్రాంత‌ల‌లో ద‌క్షిణాది లో తొలి స్థానం సిరిసిల్లా ద‌క్కించుకుంది. అలాగే రెండో స్థానంలో సిద్ధిపేట్ ప‌ట్ట‌ణం ఉంది. అలాగే 5వ ర్యాంకులో కందుకూర్‌, 8వ ర్యాంకులో పులివెందుల, 10వ ర్యాంకులో పలమనేరు, 12వ ర్యాంకులో సత్తెనపల్లి, 13లో తాడేపల్లి, 14లో బొబ్బిలి, 15లో మండపేట, 16లో వికారాబాద్‌, 17లో కావలి, 19లో పుత్తూరు, 20వ ర్యాంకులో బెల్లంపల్లి ప‌ట్ట‌ణాలు ఉన్నాయి. అయితే ప్ర‌తి ఏడాది ప‌ట్ట‌ణాల‌లో శుభ్ర‌త ప్ర‌మాణాలు పెంచాల‌ని.. పెంచిన వాటికి ప్రొత్స‌హం గా ఉండాల‌ని ఈ ర్యాంకు ల‌ను విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news